స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'.ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -471 లో.....కావ్య, స్వప్నలు అప్పుని రెడీ చేస్తారు. నాకూ ఇలా నచ్చదు. చీర కట్టుకుంటే నాకు కంఫర్ట్ ఉండదు.. నాలా నేను ఉంటానని అప్పు అంటుంది. అప్పుడే స్వప్న బంటిని పిలిచి.. అప్పు ఎలా ఉందని అడుగుతుంది. బంటి కామెడీగా ఎదరుగా ఉన్న అప్పుని చూడకుండా.. ఇక్కడ అప్పు ఎక్కడ ఉందని అంటాడు. నాక్కూడా ఇది ఇలా నచ్చట్లేదని స్వప్న అంటుంది. సరే నీకు నచ్చినట్టు ప్యాంటు షార్ట్ లోనే ఉండమని అప్పుతో కావ్య అంటుంది.
మరొకవైపు కళ్యాణ్ అప్పు గురించి ఆలోచిస్తూ.. తను గిఫ్ట్ ఇచ్చిన షర్ట్ ని చూసి బాధపడతాడు. అది చూసి రాజ్.. కళ్యాణ్ దగ్గరికి వస్తాడు. ఈ షర్ట్ పాతగా అయిపోయిందిరా.. నీకోసం అమెరికా నుండి కొత్తవి తెప్పించాను.. ఇదిలా ఇవ్వు ఇలాంటి పాతవి పెట్టుకోవద్దు.. డస్ట్ బిన్ లో పారేయ్యలంటూ రాజ్ ఆ షర్ట్ తీసుకొని బయట డస్ట్ బిన్ లో పడేస్తాడు. తన వెనకాలే వద్దు అన్నయ్య అంటూ కళ్యాణ్ వచ్చి డస్ట్ బిన్ లో నుండి షర్ట్ తీసి.. ఇది నాకు ఇష్టమైన జ్ఞాపకమని కళ్యాణ్ అంటాడు. అప్పుపైన ప్రేమని దాచుకున్నట్లు ఇది కూడా దాచుకుంటావా అని రాజ్ అంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావని రాజ్ అంటాడు. అప్పు జీవితం బాగుండాలని అనుకున్నా కానీ నేను కోరుకున్నట్లే జరుగుతుంటే.. నాకు ఎందుకో బాధగా ఉందని కళ్యాణ్ అంటాడు. అదంతా వింటున్న రుద్రాణి.. నేను అనుకున్నట్లే అయింది. ఎలాగైనా రాజ్ ఇప్పుడు అప్పు కళ్యాణ్ లని ఒకటి చేయాలని ట్రై చేస్తాడు. వాళ్ళిద్దరు ఒకటి కాకుండా నేనే ఏదో ఒకటి చేయాలని రుద్రాణి అనుకుంటుంది.
మరొకవైపు పెళ్లి చూపులకు అబ్బాయి వాళ్ళు వస్తారు. వాళ్ళు అనామిక పెట్టిన కేసు గురించి తెలిసే వస్తారు. అందులో అప్పు తప్పేం లేదని మాకు తెలుసు.. అప్పు మాకు బాగా నచ్చింది.. కట్నం కూడా అవసరం లేదని వాళ్ళు అనగానే .. అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పెళ్లి ముహూర్తం వచ్చే శుక్రవారం ఉందని పంతులు చెప్పడంతో ఇరు కుటుంబాలు.. అదే ముహూర్తం ఖాయం చేస్తారు . తరువాయి భాగంలో ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వచ్చి.. మా ఫ్రెండ్ కూతురు ఉంది.. కళ్యాణ్ కి సెట్ అవుతుంది.. నువ్వు వెళ్లి ఒకసారి చూసిరా అని రుద్రాణి అంటుంది. మరొకవైపు అప్పు దగ్గరికి స్వప్న, కావ్యలు వచ్చి.. ఏంటి ఇలా ఉన్నావ్ పెళ్లి ఇష్టం లేదా అని అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.